ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి (బాడీ గార్డ్ చీఫ్)పై అధ్యక్షుడు వేటు వేశారు.ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ అధిపతి సెర్గియ్ లియోనిడోవిచ్ రుడ్‌ను తొలగించినట్టు వెల్లడించారు. అయితే ఆయనను తప్పించడానికి గల కారణాలను మాత్రం బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం వెలుగు లోకి వచ్చిన ఈ కుట్రకు సంబంధించి స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.