ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన విపక్ష నేత అలెక్సీ నావెల్నీ మృతదేహాన్ని అధికారులు ఆయన తల్లి లియుడ్మిలాకి అప్పగించారు. అలెక్సీ నావెల్నీ మృతి చెందిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించారు. అలెక్సీ మృత దేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన తల్లికి నావెల్నీ మృతదేహాన్ని అప్పగించాలని కోరిన మీ అందరికి చాలా ధన్య వాదాలు అని నావెల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర విమర్శలు చేసే విపక్ష నేత అలెక్సీ నావెల్నీ (47) జైలులోనే మరణించారని యమాలో సెనెట్స్ ప్రాంత జైలు సర్వీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. నావెల్నీ పలు కేసుల్లో దోషిగా తేలడంతో 2021 జైలు శిక్ష అనుభవించారు. కాగా, ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, నావెల్నీ మృతదేహం రహస్యంగా ఖననం చేయాలని, ఎటువంటి అంతిమయాత్ర చేయడానికి వీల్లేదని తమపై రష్యా సర్కార్ ఒత్తిడి తెచ్చింద ని నావెల్నీ తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు.