
సుమయరెడ్డి హీరోయిన్‌గా నటించి, నిర్మించిన చిత్రం డియర్ ఉమ. దియా ఫేమ్ పృథ్వీ అంబర్ హీరోగా సాయిరాజేశ్ మహదేవ్ తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సుమయ రెడ్డి మాట్లాడుతూ తాము కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు మీడియా ఎంతో సపోర్ట్ చేసిందన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ తాను చెప్పాల్సిదంతా సినిమాలో చెప్పేశారన్నారు. తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారని, తాను ఒకడగు ముందుకు వేసి సినిమాను నిర్మించానని చెప్పారు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకువచ్చామని, మంచి ప్రేమకథతో పాటు సందేశం ఉన్న ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూసి మంచి విజయాన్ని అందించాలని కోరారు.
దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం తమ టీమ్ అంతా చాలా కష్టపడిందన్నారు. తాను బుర్రకథ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశానని.. ఆ టైమ్‌లోనే సుమయ రెడ్డిని కలిశానని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు ఓ షార్ట్ ఫిల్మ్‌కి కోసం పని చేశామన్నారు. కరోనా సమయంలో ఆమె ఓ కథ రాశారని.. అది తనకు చాలా నచ్చిందన్నారు. అలా డియర్ ఉమ సినిమా మొదలు పెట్టామన్నారు. ఈ కథను నమ్మి చాలా మందికి వద్దకు వెళ్లామని.. స్టోరీలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందన్నారు. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో సునయ రెడ్డి ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. తమ వెనుక ఎవరూ లేరని.. మీడియా, ప్రేక్షకులు సపోర్ట్ కావాలని కోరారు. డియర్ ఉమ తప్పకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు.
