Namaste NRI

అమెరికాలో భారత సంతతి యువతకు… బహిష్కరణ ముప్పు

చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే చదువుకున్నారు. కుటుంబం, స్నేహితులు, వృత్తి అంతా అక్కడే. కానీ, ఉన్నఫళంగా అన్నింటినీ వదిలేసి, దేశాన్ని విడిచి వారి సొంత దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమెరికాలో దాదాపు 2.50 లక్షల మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న ఏజింగ్‌ అవుట్‌ ముప్పు సమస్య ఇది. వీరిలో భారత సంతతికి చెందిన వారే దాదాపు సగం మంది ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.

భారత్‌ సహా వేర్వేరు దేశాల నుంచి అమెరికాకు తాత్కాలిక వర్క్‌ వీసాల మీద వెళ్లిన వ్యక్తులు పిల్లలను కూడా తమతో తీసుకెళ్లవచ్చు. ఈ పిల్లలు తల్లిదండ్రులపై డిపెండెంట్‌(ఆధారపడినవారు) హోదాతో అమెరికాలో ఉండేందుకు వీలు ఉంటుంది. అయితే, వీరికి 21 ఏండ్ల వయస్సు వచ్చినా, వివాహం జరిగినా డిపెండెంట్‌ హోదా కోల్పోతారు. అంతలోపు వారికి గ్రీన్‌ కార్డు, ఇతర వీసా ఏదైనా రాకపోతే వారు బలవంతంగా అమెరికా నుంచి వారి సొంత దేశాలకువెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్యనే ఏజింగ్‌ అవుట్‌ అంటారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే యువతీ యువకులను డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ అని పిలుస్తారు. అయితే, అమెరికాలో స్థిరపడటానికి ఇచ్చే గ్రీన్‌ కార్డుల జారీ చాలా ఆలస్యమవుతున్నది. ఏండ్ల తరబడి గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ(ఎన్‌ఎఫ్‌ఏపీ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 12 లక్షల మంది ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress