టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఉమను అరెస్ట్ చేసిన పోలీసులు… ఆయన్ను ఆన్‌లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. మంగళవారం రాత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. కృష్ణా జిల్లా గడ్డమణుగులో ప్రభుత్వం ఇళ్ల స్థలాలను సిద్ధం చేసే క్రమంలో చదును చేయడం ప్రారంభించింది. ఇంతలో మాజీ మంత్రి దేవినేని ఉమ అక్కడకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. దీంతో ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు.