
నిఖిల్ యుద్ధవీరుడిగా నటిస్తున్న చిత్రం స్వయంభూ. సంయుక్త, నభా నటేష్ కథానాయికలు. భరత్ కృష్ణ మాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. కె.కె.సెంథిల్‌కుమార్ స్వయంభు లో భాగమయ్యారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్లను నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ అక్కడే జరుగుతున్నది. నిఖిల్ కెరీర్‌లో ఇది అత్యంత భారీ చిత్రమని మేకింగ్ వీడియో చెప్పకనే చెబుతున్నది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేశారు. రెండు కత్తులతో శత్రువులను దునుమాడే సవ్యసాచిలా ఈ పోస్టర్‌లో నిఖిల్ కనిపిస్తున్నారు. నిఖిల్ 20వ సినిమాగా తెరకెక్కు తున్న ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.
