Namaste NRI

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న దీక్షిత్‌.. శబార

దీక్షిత్‌శెట్టి, క్రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం శబార. ప్రేమ్‌చంద్‌ కిలారు దర్శకుడు. హార్ట్‌బీట్‌ ఆఫ్‌ శబర పేరుతో సినిమా గ్లింప్స్‌ను పరిచయం చేస్తూ ఈవెంట్‌ను నిర్వహించారు. అడవి నేపథ్యంలో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకడు ఈ సినిమాను తెరకెక్కించారని, బంగారం కోసం చేసే అన్వేషణ, పోరాటం నేపథ్యంలో సాగే కథ ఇదని హీరో దీక్షిత్‌ శెట్టి అన్నారు.

కథలో కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని దర్శకుడు ప్రేమ్‌చంద్‌ పేర్కొన్నారు. అద్భుతమైన లొకేషన్లలో తీసిన ఈ సినిమా కన్నులపండువగా ఉంటుందని కథానాయిక క్రితికా సింగ్‌ చెప్పింది. మిషా నారంగ్‌, మోహన్‌ భగత్‌, భూషణ్‌ కల్యాణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిథున్‌ ముకుందన్‌, నిర్మాతలు: హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు, రచన-దర్శకత్వం: కిలారు ప్రేమ్‌చంద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events