శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ చక్కటి ప్రణాళికతో కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నది. ఐదేళ్ల సినీ ప్రయాణంలో వివాదాలకు దూరంగా సౌమ్యురాలిగా పేరు తెచ్చుకుందీ భామ. ఎలాంటి దాపరికం లేకుండా మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తుందని ఈ అమ్మడి గురించి తెలిసివారు చెబుతుంటారు. ఓ ఇంటర్వ్యూలో సినిమా వాళ్లతో డేటింగ్ గురించి తన అభిప్రాయా ల్ని వ్యక్తం చేసింది జాన్వీకపూర్. ఇండస్ట్రీకి చెందిన వారితో డేటింగ్ చేయడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. సినీరంగంలో పనిచేసేవారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఎవరికీ సమయాన్ని కేటాయించలేరు. ఇద్దరూ ఒకే వృత్తిలో ఉంటే డేటింగ్ చేయ డం ఇంకా కష్టమైపోతుంది. అందుకే సినిమా వాళ్లతో డేటింగ్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు అని జాన్వీకపూర్ చెప్పుకొచ్చింది.














