Namaste NRI

డీజే టిల్లు దీపావళి సర్ ప్రైజ్

 యువ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘టిల్లు 2’. బాక్ల్ బస్టర్ మూవీ డీజే టిల్లుకు ఈ సినిమా సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్‌ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. మా స్టార్‌ బాయ్‌ సిద్దునూ కలవండి.. రెట్టింపు వినోదం, డబుల్ రొమాన్స్‌, డబుల్‌ మ్యాడ్ నెస్‌ తో టిల్లు ఈజ్‌ బ్యాక్ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు మేకర్స్.  ఈ మూవీలో సిద్దుకు జోడీగా అనుప‌మ‌ పరమేశ్వరన్ నటిస్తుండగా.. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ ను ప్రారంభించిన మేకర్స్, ఈ సినిమాను 2023 మార్చిలో  విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. కామెడీ థ్రిల్ల‌ర్ జోనర్‌లో రాబోతున్న సీక్వెల్‌లో అనుప‌మ‌, సిద్దు రొమాంటిక్ స‌న్నివేశాలు మూవీ లవర్స్‌ను ఫిదా చేసేలా ఉండబోతున్నాయని ఇన్‌ సైడ్‌ టాక్‌‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events