ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా మాజీ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ మరోసారి నామినేట్ చేసింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్రహం అకార్డ్స్ ఒప్పందంతో పాటు ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ మధ్య సంబంధాలను మెరుగుపరిచినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కోరారు. నోబెల్ బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేయడం ఇది నాలుగోసారి.