అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయం (2015)లో ప్రైవేటు భద్రతా సిబ్బంది తమపై దాడికి దిగారంటూ కొందరూ ఆందోళకారులు పెట్టిన కేసును పరిష్కరించుకున్నారు. ఇరుపక్షాల సమ్మతి మేరకు రాజీ కుదిర్చేందుకు కోర్టులో జ్యూరీని నియమించారు. మెక్సికో, ఆ దేశ వలసదారులపై ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మన్హటన్లోని ఆయన భవనం ఎదుట అయిదుగురు న్యూయార్క్ వాసులు 2015 సెప్టెంబరు 3న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ భద్రతా సిబ్బంది తమపై దాడి చేశారని బాధితులు కేసు వేశారు.














