పర్యాటకులు, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు వేగంగా వీసా ఇంటర్వ్యూకు హాజరు కావాలనుకొంటే వారి నుంచి వెయ్యి డాలర్లు వసూలు చేయాలనే ప్రతిపాదన అమలును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అయితే అమెరికా ప్రభుత్వం ఇంటర్నల్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ విషయమై జారీ చేసిన మెమోపై ప్రభుత్వ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ తరహా వీసా ఇంటర్య్యూల కోసం దరఖాస్తుదారులు 185 డాలర్లను ప్రాసెసింగ్ రుసుముగా చెల్లిస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం ఎవరైనా వెయ్యి డాలర్లు చెల్లిస్తే ప్రీమియం సర్వీస్ కింద వారికి త్వరగా వీసా ఇంటర్య్యూలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.
