Namaste NRI

భయపడకు.. మరో ప్రపంచం వస్తుంది

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌  టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్‌ ప్రాజెక్ట్‌ కల్కి 2898 ఏడీ.  ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్‌. సోమవారం విడుదలైన కల్కి 2898  సినిమా ట్రైలర్‌ ద్వారా దర్శకుడు నాగ్‌అశ్విన్‌ మూడు నిమిషాల పాటు కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుంది? అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా ఈ ట్రైలర్‌ ఉంది. సృష్టిని కాపాడాలంటే, ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డను కాపాడాలి అంటూ అశ్వత్థామగా అమితాబ్‌ ప్రవర్తన ఆ ట్రైలర్‌లో చూడొచ్చు. ఇందులో నిండు చూలాలైన తల్లిగా దీపిక పదుకొనే కనిపించింది. ఆ తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఎవరు? ఆ బిడ్డేనా కల్కి? అంటే ఇందులో ప్రభాస్‌కి తల్లిగా దీపిక పదుకొనే నటించిందా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమ య్యేలా ట్రైలర్‌ ఉంది. ఈ సృష్టిలో తొలి నగరం కాశీ,  చివరి నగరం కూడా కాశీనే అని సృష్టి అంతం గురించి చెబుతూ పునరుజ్జీవాన్ని కూడా చూపించారు.

ఆరువేల సంవత్సరాల క్రితం నాటి పవర్‌ మళ్లీ కనిపించింది. అంటే ఇక వెలుగు వచ్చే సమయం ఆసన్న మైంది అని రాజేంద్రప్రసాద్‌ పాత్ర చెప్పడం కల్కి 2898 ఆగమనం గురించే అని అర్థమవుతుంది. చివరగా కమల్‌హాసన్‌ వింతరూపంలో కనిపించి భయపడకు, మరోప్రపంచం వస్తుంది అంటూ షాక్‌ ఇచ్చారు. అశ్వత్థా మ పోరాటాలు, కల్కి సాహసాలు హాలీవుడ్‌ను తలదన్నే అద్భుతమైన సాంకేతికత ఇవన్నీ కల్కి 2898 ట్రైలర్‌ లో కనిపించాయి. దిషాపటానీ, రాజేంద్రప్రసాద్‌  చాలామంది ఈ ట్రైలర్‌లో కనిపించారు. వైజయంతీమూవీస్‌ చరిత్రలోనే అత్యంత భారీగా రూపొందిన ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events