రాజ్‌తరుణ్ హీరోగా ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరాసామీ. మాల్వి మల్హోత్రా కథానాయిక. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్ మెంట్ తో ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ మాట్లాడుతూ ఈ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకు చాలా కొత్త. ఈ సినిమాలో ఎమోషన్‌తో పాటు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఆకట్టుకుంటుంది అన్నారు.
రాజ్‌తరుణ్ రాబోవు రోజుల్లో మాస్ హీరోగా నిలదొక్కుకుంటాడని, ఈ సినిమాకు ప్రతిభావంతులైన టెక్నీషియ న్స్ దొరికారని, నిర్మాత రాజీ లేకుండా తెరకెక్కించారని దర్శకుడు రవి కుమార్ చౌదరి తెలిపారు. సైలెంట్‌గా మొదలై వయొలెంట్‌గా ముగిసే కథాంశమిదని, రాజ్‌తరుణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.