సూర్యతేజ ఏలే హీరోగా రూపొందుతున్న చిత్రం భరతనాట్యం. సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’ అనేది ఉపశీర్షిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. పాయల్ సరాఫ్ నిర్మాత. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పాటను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా విడుదల చేశారు. డుగు డుగు అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, వివేక్‌సాగర్ స్వరపరిచారు. మంగ్లీ హైపిచ్‌లో ఆలపించి ఈ పాటకు మరింత ఎనర్జీ తెచ్చిపెట్టిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. విడుదల చేసిన ఈ పాట వీడియోలో కథానాయిక మీనాక్షి గోస్వామి అందం, శేఖర్ మాస్టార్ డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని వారు చెప్పారు. వైవా హర్ష, హర్షవర్దన్, అజయ్‌ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాకమూరి.