Skip to main content

Namaste NRI

భరతనాట్యం మూవీ నుంచి డుగు డుగు సాంగ్

సూర్యతేజ ఏలే హీరోగా రూపొందుతున్న చిత్రం భరతనాట్యం. సినిమా ఈజ్‌ ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఫ్రాడ్‌ ఇన్‌ ది వరల్డ్‌’ అనేది ఉపశీర్షిక. కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడు. పాయల్‌ సరాఫ్‌ నిర్మాత. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పాటను స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చేతులమీదుగా విడుదల చేశారు. డుగు డుగు అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాయగా, వివేక్‌సాగర్‌ స్వరపరిచారు. మంగ్లీ హైపిచ్‌లో ఆలపించి ఈ పాటకు మరింత ఎనర్జీ తెచ్చిపెట్టిందని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. విడుదల చేసిన ఈ పాట వీడియోలో కథానాయిక మీనాక్షి గోస్వామి అందం, శేఖర్‌ మాస్టార్‌ డాన్స్‌ మూమెంట్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయని వారు చెప్పారు. వైవా హర్ష, హర్షవర్దన్‌, అజయ్‌ఘోష్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ ఆర్‌. శాకమూరి.

Social Share Spread Message

Latest News