Namaste NRI

ఓనం కానుకగా దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత

పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ సినీ పరిశ్రమలో విజయవంతంగా 11 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ కింగ్ ఆఫ్ కోత 2023 ఓనం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానులలో సందడి చేస్తోంది. అతని తొలి చిత్రం సెకండ్ షో లో అందరూ ఇష్టపడే గెటప్ లాగానే, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ రగ్డ్ లుక్ ఈ పోస్టర్లో అలరిస్తోంది.

జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న కింగ్ ఆఫ్ కొత చిత్రం షూటింగ్ తమిళనాడులోని కరైకుడిలో జరుగుతోంది. అభిలాష్ ఎన్ చంద్రన్ రాసిన ఈ చిత్రం పాన్-ఇండియన్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ , ఎడిటర్ గా శ్యామ్ శశిధరన్ పని చేస్తుండగా, జేక్స్ బిజోయ్ , షాన్ రెహమాన్ కలసి సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రానికి  తారాగణం: దుల్కర్ సల్మాన్, టెక్నికల్ టీం,  దర్శకత్వం: అభిలాష్ జోషి, బ్యానర్స్ : జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలింస్, సంగీతం : జేక్స్ బిజోయ్ , షాన్ రెహమాన్, సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి, ఎడిటింగ్: శ్యామ్ శశిధరన్, కాస్ట్యూమ్ డిజైన్: ప్రవీణ్ వర్మ, పీఆర్వో : వంశీ-శేఖర్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events