టాంపా బేలో నార్త్ అమెరికా తెలుగు సంఘం ( నాట్స్) విద్యా సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్య క్రమానికి 200 మందికిపైగా హాజరయ్యారు. మరో 50 మంది ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అమెరికాలోని పలు కళాశాలల్లో కోర్సులు, అడ్మిషన్ ప్రక్రియపై మార్గనిర్దేశం చేశారు. ప్రముఖ కళాశాలల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు వారి విలువైన సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చింది. సలహాదారులు, నిపుణులతో విద్యార్థులు, తల్లి దండ్రులు నేరుగా మాట్లాడే అవకాశం లభించింది. పలువురు తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమ్మేళ నానికి హాజరైన ప్రొఫెసర్లు నాట్స్‌ను ప్రశంసించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడేందు కు తమకు ఇది ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు నాట్స్ టాంపా బే కోర్ వాలంటీర్లకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థలు సప్తా, మాటా, మెలోడీ మాక్‌టైల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహకారాన్ని అందించిన యూఎస్‌ఎఫ్ మెడిసిన్ డాక్టర్ మిలింద్ కొఠారి, ఎన్‌ఎస్‌యూ డీవో డాక్టర్ సిరిల్ బ్లావో ( చైర్, ఎన్‌ఎస్‌యూ), యూఎన్‌ఎఫ్ పీఏ డాక్టర్ టాడ్ విల్స్ ( అసోసియేట్ డీన్), యూఎస్‌ఎఫ్ ఫార్మాసీ డాక్టర్ నికోలస్ కారిస్, ఎస్‌ఎఫ్ బిజినెస్ అనలిటిక్స్, ఏఐ డాక్టర్ మనీష్ అగర్వాల్, యూఎస్‌ఎఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డాక్టర్ అజిత్ మజుందార్, ఎఫ్‌ఐటీ గణితం డాక్టర్ జ్ఞానభాస్కర్ తెనాలి( చైర్), యూఎస్‌ఎఫ్ నానో ప్రోగ్రామ్ థామస్ క్లార్క్ లకు నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత పిన్నమనేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టంపాబే విభాగం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి టంపాబే నాయకులను ప్రశంసించారు. ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళి మేడిచర్ల, కిషోర్ నార్నే, వెబ్ టీమ్ రవికిరణ్ తమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమ్మేళనంలో మాటా చాప్టర్ ప్రెసిడెంట్ టోనీ జన్ను. మెలోడి మాక్‌టైల్ రవి బరాటం, నాట్స్ మాజీ చైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ కొత్త శేఖరం, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్యనిర్వహణ కమిటీ వైఎస్ ప్రెసిడెంట్ ( ఫైనాన్స్ / మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి రాజేష్ కాండ్రు, ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైఎస్ ప్రెసిడెంట్ ( సౌత్ ఈస్ట్) సుమంత్ రామినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భారత్ ముద్దన, మాధవి యార్లగడ్డ, మాలినీ రెడ్డి, సతీష్ పాలకుర్తి, సుధాకర్ మున్నంగి, ప్రసాద్ నేరళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ తదితరులు పాల్గొన్నారు.