అమెరికాలోని న్యూయార్క్లో ఒక వైద్య కళాశాల పంట పండింది. ఒక ధనిక దాత అనూహ్యంగా ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,290 కోట్లు) విరాళంగా అందజేశారు. దీంతో ఇక నుంచి విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజును వసూలు చేయబోమని ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ప్రకటించింది. ఐన్స్టీన్ బోర్డు ట్రస్టీ చైర్మన్ రూత్ గోట్టెస్మన్ ఈ విరాళం అందజేసినట్టు కాలేజీ నిర్వాహకులు ప్రకటించగానే విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ ఏడాదికి చెల్లించిన విద్యార్థుల ఫీజును వాపసు ఇస్తామని, ఆగస్టు నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోమని కాలేజీ యాజమాన్యం తెలిపింది.