మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
మరోవైపు ఝార్ఖండ్‌లో రెండు విడుతల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడత నవంబర్ 13వ తేదీన 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా38 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతు న్నది. ఈ ఎన్నికల్లో సీఎం హేమంత్ సొరేన్, ఆయన భార్య కల్పనా సొరేన్, విపక్ష బీజేపీ నేత అమర్ కుమార్ బౌరీ సహా 528 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, 31 సమస్యాత్మక ప్రాంతాల్లో మావోయి స్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఝార్ఖండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.