అమెరికా అధ్యక్ష ఎన్నికలునవంబర్‌లో జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి ఈవీఎంల వాడకానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఈవీఎంల కన్నా పేపర్ బ్యాలెట్ మేలని నొక్కి చెప్పారు.ఈవీఎంలు, మెయిల్ చేసిన ఏ విషయమైనా చాలా రిస్క్‌తో కూడుకు న్నది. మనం పేపర్ బ్యాలెట్‌నే అనుసరించాలి అని మంగళవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయా నికి మద్దతుగా ఈవీఎంల గురించి కొన్ని అమెరికా వార్తా కథనాలను జత చేశారు. అయినా చాలా మంది ఎక్స్ వినియోగదారులు అతడి సిద్ధాంతానికి మద్దతు ఇవ్వలేదు.