టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది. టెక్సాస్ లోని బొకాచికా వేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే, కరేబియన్ మీదుగా భూవాతావరణంలోకి ప్రవేశించిన ప్పుడు సాంకేతిక లోపం తలెత్తడంతో అది పేలిపోయింది. దీంతో దాని శకలాలు కరేబియన్ సముంద్రంలో పడిపోయా యి. పెద్దఎత్తున నిప్పులు చిమ్ముతూ అవి పేలిపోయాయి. బూస్టర్ మాత్రం క్షేమంగా లాంచ్ ప్యాడ్‌కి తిరిగి చేరుకుంది.

రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ స్పందించింది. ప్రయోగం విఫలమవడానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నామని వెల్లడించింది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్ విశ్వసనీయతను పెంచిందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
