Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ రికార్డు… ప్రపంచంలోనే తొలిసారి        

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం, అమెరికన్‌ టైకూన్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కు బాగా కలిసొచ్చింది. ట్రంప్‌ విజయంతో మస్క్‌ సంపద అమాంతం పెరిగింది. దీంతో ఆయన తాజాగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సందప పరంగా మస్క్‌ ఏకంగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. తద్వారా ప్రపంచంలోనే తొలిసారి ఈ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచారు.  స్పేస్‌ఎక్స్‌  అంతర్గత వాటా విక్రయంతో మస్క్‌ సంపద దాదాపు 50 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా మస్క్‌ చరిత్ర సృష్టించారు.

Social Share Spread Message

Latest News