శ్యామ్ షెల్వన్, హాన్విక, రితిక, గ్రీష్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ. కిరణ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎం.ఎం.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథాంశమిదని, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సందేశం ఉంటుందని దర్శకుడు కిరణ్ తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గాజుల శివ, సంగీతం: చరణ్ అర్జున్.