ప్రపంచవ్యాప్తంగా షెన్‌జెన్ వీసా ఫీజును 12 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. స్లొవేనియా విదేశాంగ, యూరోపియన్ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం జూన్ 11 నుంచి పెద్దల వీసా ఫీజు 80 యూరోల నుంచి 90 యూరోలకు, 6-12 ఏండ్లలోపు పిల్లల వీసా ఫీజు 40 నుంచి 45 యూరోలకు పెరగనుంది. ఈయూలో అక్రమంగా ఉంటూ తమ పౌరులను తిరిగి స్వదేశంలోకి అనుమతించని దేశాలకు చెందిన వారి వీసా రుసుమును 135 యూరోలకు పెంచింది. ఇది 180 యూరోలు కూడా చేరవచ్చు. ఈయూలో స్వల్ప కాలం బస చేసే వారికి షెన్‌జెన్(టైప్ సి) వీసా జారీ చేస్తారు.