Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ తగ్గినా.. మేం తగ్గేదేలే!

ఇరాన్‌లోని చమురు క్షేత్రాలు, పవర్‌ ప్లాంట్లపై ఐదు రోజులపాటు దాడులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పటికీ, ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరు దేశాలూ పరస్పర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు చేయగా, ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌, గ్యాస్‌ ప్లాంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు, అమెరికాతో చర్చించడానికి ఇరాన్‌ నూతన సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. తటస్థ దేశాల నౌకలు హొర్ముజ్‌ గుండా వెళ్లడానికి అనుమతిస్తూ ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events