Namaste NRI

ఈ సినిమా చూసినవారందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేస్తారు : శివాజీ

శివాజీ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. సుధీర్‌ శ్రీరామ్‌ దర్శకుడు. ఒకప్పటి హిట్‌ పెయిర్‌ శివాజీ, లయ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు.నిర్మాతలు బన్నీ వాస్‌, వంశీ నందిపాటి థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సినిమా చూసినవారందరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారని, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలనని శివాజీ అన్నారు.

తన సెకండ్‌ ఇన్సింగ్స్‌కు శుభారంభాన్ని అందించే చిత్రమవుతుందని నటి లయ చెప్పింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ క్రైమ్‌ ఎలిమెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి తెలిపారు. అలీ, ధనరాజ్‌, ప్రిన్స్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, రాజ్‌ తిరందాసు తదితరులు నటిస్తున్నారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్‌ రాజ్‌, నిర్మాత: శివాజీ సొంటినేని, రచన-దర్శకత్వం: సుధీర్‌ శ్రీరామ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events