Namaste NRI

ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది: కార్తీ

కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం సత్యం సుందరం. 96ఫేం సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. ఏషియన్‌ సురేశ్‌ ఎంటైర్టెన్మెంట్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కార్తీ మాట్లాడారు. ఇప్పడంటే తెలుగు సినిమా భారీ తనానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యిందికానీ,  ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు. పెద్ద వంశీగారి సినిమాలు. మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలను వారి సినిమాల్లో చూశాం. అలాంటి సినిమాలు ఈ రోజుల్లో చేయడం కుదరదా అనుకుంటున్న టైమ్‌లో 96 డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ రాసుకున్న కథను చదివాను. ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. అన్నయ్యకి ఈ స్క్రిప్ట్‌ ఇచ్చాను. ఆయన చదివి ఎమోషన్‌ అయ్యారు. ఇలాంటి కథలు నీకే ఎలా దొరుకుతాయి? అన్నారు.

ఇందులో మరోముఖ్యమైన పాత్రను అరవింద్‌స్వామి చేశారు. కమల్‌హాసన్‌ స్థాయిలో నటించారాయన. ఖైదీ లా నైట్‌ షూట్‌ ఉండే కథ ఇది. డైరెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ ప్లాన్డ్‌గా షూట్‌ చేశారు. ఇప్పటివరకూ చూడని కజిన్స్‌ ఎమోషన్‌తో తెరకెక్కిన కథ ఇది. మాకంటే ఒకరోజు ముందు బ్రదర్‌ తారక్‌ దేవర రాబోతున్నది. కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుంది.దేవర వార్‌ ఫైర్‌ లాంటి సినిమా. మనది సిరిమల్లె పువ్వులాంటి బ్యూటిఫుల్‌ సినిమా. మనసుపెట్టి చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని హీరో కార్తీ అన్నారు.  ఈ సినిమా తనకెంతో ప్రత్యేమని, ఆర్య, జగడం సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశానని, తన కెరీర్‌ టాలీవుడ్‌లోనే మొదలైందనీ దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ గుర్తు చేసుకున్నారు. ఇంకా నటి శ్రీదివ్య, నిర్మాత సురేశ్‌బాబు, రచయిత రాకేందు మౌళిలతోపాటు అతిథులుగా విచ్చేసిన విశ్వక్‌సేన్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ కూడా మాట్లాడారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events