పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, పార్టీ నిధుల వివరాలను దాచినందుకు గత ఏడాది జాతీయ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీ నిరసనలకు ఆయన పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఇమ్రాన్ ఖాన్ చేసిన అభ్యర్థనను ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు గత వారం తిరస్కరించింది. దీంతో ఆయన లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.