Namaste NRI

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు  ఊరట

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు  ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండా లాహోర్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, పార్టీ నిధుల వివరాలను దాచినందుకు గత ఏడాది జాతీయ అసెంబ్లీకి అనర్హుడయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భారీ నిరసనలకు ఆయన పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌పై  కేసు నమోదైంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ను  పొడిగించాలని ఇమ్రాన్ ఖాన్ చేసిన అభ్యర్థనను ఇస్లామాబాద్‌లోని  ఉగ్రవాద నిరోధక కోర్టు గత వారం తిరస్కరించింది. దీంతో ఆయన లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు.

Social Share Spread Message

Latest News