పశ్చిమ దేశాలకు చెందిన 16 మంది ఖైదీలను రష్యా రిలీజ్ చేసింది. అమెరికా, జర్మనీ, నార్వే, పోలాండ్, స్లోవేనియా దేశాల్లో ఉన్న 8 మంది రష్యా జాతీయుల్ని కూడా రిలీజ్ చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గ్రెస్‌కోవిచ్‌తో పాటు అమెరికా మెరైన్ పౌల్ వీలన్, జర్మనీ దేశస్థుడు రికో క్రీగర్‌తో పాటు మరికొందర్ని రష్యా రిలీజ్ చేసింది. మొత్తంగా 20మందికి పైగా ఖైదీల మార్పిడికి ఇరుదేశాలు అంగీకరించినట్లు సమాచా రం. రష్యా రిలీజ్ చేసిన అమెరికా జాతీయులు మేరీల్యాండ్ విమానాశ్రయానికి చేరుకున్నా రు. ఆ ఖైదీలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వాగతం పలికారు. ఖైదీల అప్పగింత ఒప్పందం ప్రకారం ఏడు దేశాల నుంచి 24 మంది రిలీజ్ అయ్యారు. మాస్కోలో అధ్యక్షుడు పుతిన్ రిలీజైన ఖైదీలను కలిశారు. ఆ ఖైదీలకు ప్రభుత్వ పురస్కారాన్ని అందించనున్నట్లు ఆయన చెప్పారు.