Namaste NRI

ప్రవాస భారతీయులే మాకు స్ఫూర్తి.. న్యూయార్క్‌ ఇండియన్ కాన్సులేట్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

ఖండాతరాలు దాటి వచ్చినా జన్మభూమిపై ప్రవాసీయులు చూపిస్తున్న ప్రేమ, గౌరవం అద్భుతమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. న్యూయార్క్‌లో ఇండియన్ కాన్సులేట్ ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయులతో సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.  మాతృభూమి అభివృద్ధి కోసం తపించే ప్రవాస భారతీయులే మాకు స్ఫూర్తి అని అన్నారు.  ప్రపంచ ఫార్మసీ హబ్, ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ గా ఎదగడంలో దేశ యువత,  భారత సంతతి ప్రజల పాత్ర కీలకమని వెల్లడించారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఉన్నా భారత్‌పై దీని ప్రభావం లేకపోవడానికి మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలిపారు. దేశం నేడు సాధిస్తున్న ప్రగతిని, పలు విజయాలను ప్రవాసీయులతో కిషన్‌రెడ్డి పంచుకున్నారు.

ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారతదేశానికి,  ఏటా 3 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. 2014 -15లో ఉన్న విదేశీ మారక నిల్వలు (45.15 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే  మే, 2023 నాటికి దేశంలో 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. వాణిజ్య, సేవల ఎగుమతుల విలువ 750 మిలియన్ డాలర్లు దాటిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా 2014లో దేశంలో శూన్యంగా ఉన్న మొబైల్ ఎగుమతులు ఇవాళ రూ.43,500 కోట్లు దాటిన విషయాన్ని ప్రస్తావించారు. అన్ని సేవల రంగంలోనూ భారత్ సత్తాచాటుతోందన్నారు. రానున్న 25 ఏళ్లలో దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేందుకు భారతీయులతోపాటు,  ప్రవాసీయులు కూడా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress