
అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. పర్యటనలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన గౌరు వెంకట్ రెడ్డి ఎన్నారైలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గం లోని ఓర్వకల్ ప్రాంతాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారని, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓర్వకల్ కీలకపాత్ర పోషించనుందనిపేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు తమ నైపుణ్యం, పెట్టుబడులతో ముందుకు వచ్చి తమవంతు పాత్ర పోషించాలని కోరారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్, తానా బోర్డు సభ్యుడు పొట్లూరి రవి నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.
