
చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. రాజశేఖరుని దర్శకుడు. కేకేఆర్, బాలరాజు నిర్మాతలు. ఈ సినిమాలోని టైటిల్ గీతాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ వినూత్నమైన కథతో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. యువతకు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శిష్టా వీఎమ్‌కే, సంగీతం: కల్యాణి మాలిక్, రచన-దర్శకత్వం: బాల రాజశేఖరుని.
