ప్రపంచంలో ప్రముఖ నేతలు, టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఇదిగో అచ్చం ఇలాగే ఉంటుంది. అయితే వాస్తవానికి ఇది సాధ్యంపోయినా, అసలు మనం ఊహించకపోయినా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధతో సుసాధ్యమైంది. ఏఐ ఫ్యాషన్‌కు ఇదే మంచి సమయం అంటూ టెస్లా సీఈవో, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిది అందరినీ ఆకట్టుకుంటున్నది.
రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్ అధినేత జఫ్ బేజోస్, ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకరబర్గ్, ప్రపంచ కుబేరుడు మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలా ఒకరి వెంట ఒకరు ర్యాంప్ వాక్ చేస్తూ వస్తే ఎలా ఉంటుందో ఓ లుక్కేయండి.