Namaste NRI

తండ్రి ఆరాటం…కొడుకు పోరాటం…షూటింగ్ కంప్లీట్ చేసుకున్న లైఫ్

శ్రీహర్ష, కషిక కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం లైఫ్‌ (లవ్‌ యువర్‌ ఫాదర్‌). పవన్‌ కేతరాజు దర్శకత్వం. ఈ చిత్రాన్ని కిషోర్‌ రాఠీ, మహేష్‌ రాఠీ, ఏ.రామస్వామి నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు మాట్లాడుతూ కొడుకు బాధ్యత చూసుకుంటూ తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. కాశీ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ సినిమాలో శివ తత్వాన్ని చూపించే ప్రయత్నం చేశాం. చక్కటి కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది అన్నారు. దైవిక అంశాలతో పాటు తండ్రీకొడుకు మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress