వేదిక ప్రధాన పాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా.హరిత గోగినేని దర్శకత్వం. డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఇది హారర్‌తో కూడుకున్న సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాను 16రోజుల్లో పూర్తి చేశాం. సినిమా మొదలైన ఏడు నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అవార్డులకు ఐప్లె చేస్తే, 39 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులొచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా సినిమా చేయగలిగామంటే కారణం ఆర్టిస్టులు, టెక్నీషియన్సే. ఉన్న బడ్జెట్లో క్వాలిటీగా సినిమా చేశాం. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినందుకు సంతోషంగా ఉంది అని డైరెక్టర్ డా.హరిత గోగినేని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.