వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఈ చిత్రం లో శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో బేబీ సారా కీలకమైన పాత్రను పోషిస్తున్నది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో బేబీ సారా గాయత్రి అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ కథకు ఆయువు పట్టులా చిన్నారి పాత్ర ఉంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వెంకటేష్ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుంది. తన వారిని రక్షించుకోవడానికి అతను చేసిన పోరాటం ఏమిటన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. ఆయన పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది.
ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను. పాన్ ఇండియా మూవీ సైంధవ్ డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.