Skip to main content

Namaste NRI

సైంధవ్‌ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

 వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. శైలేష్‌ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఈ చిత్రం లో శ్రద్ధాశ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాలో బేబీ సారా కీలకమైన పాత్రను పోషిస్తున్నది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో బేబీ సారా  గాయత్రి అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ కథకు ఆయువు పట్టులా చిన్నారి పాత్ర ఉంటుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వెంకటేష్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుంది. తన వారిని రక్షించుకోవడానికి అతను చేసిన పోరాటం ఏమిటన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. ఆయన పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది.

ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.మణికందన్‌, సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, రచన-దర్శకత్వం: శైలేష్‌ కొలను. పాన్ ఇండియా మూవీ సైంధవ్ డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events