Namaste NRI

తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్

బాలీవుడ్ న‌టుడు షాహిద్‌ కపూర్‌, కృతిసనన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. అన్‌ ఇంపాజిబుల్‌ లవ్‌ స్టోరీ అనేది ఉపశీర్షిక. అమిత్‌జోషి-ఆరాధనా సాహ్ సంయుక్తంగా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, మాడాక్‌ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దినేష్‌ విజన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 09న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచారు. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, న్యూఏజ్‌ రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా ఈ మూవీ ఉండ‌నున్న‌ట్లు తెలుస్తుంది.  ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేశారు. లాల్ పీలీ అకియాన్ అంటూ ఈ పాట ఉండ‌గా ఫుల్ రొమాంటిక్‌గా ఈ పాట సాగింది. ఇక ఈ పాటకు షేక్ జానీ బాషా కొరియోగ్రఫీ అందించగా, తనిష్క్ బాగ్చి లిరిక్స్ కంపోజ్ చేశాడు. నీరజ్ రజావత్ ఈ పాటకు సాహిత్యం అందించగా, రోమి.. తనిష్క్ ఈ పాటను ఆలపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events