Namaste NRI

హరిహర వీరమల్లు నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌

పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. పిరియ‌డిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు మేక‌ర్స్. ఇందులో భాగంగానే నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ను వెల్ల‌డించారు. ఈ మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మాట వినాలి  అనే పాట‌ను జ‌న‌వ‌రి 06న ఉద‌యం 9 గంట‌ల 6 నిమిషాల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకున్నారు.

రూల్స్ రంజన్ ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా,  రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్  పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress