సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శకుంతల గా సమంత కనిపించనుండగా దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్ర చేస్తు న్నారు. ఈ మూవీ నుండి మల్లిక మల్లిక అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని జనవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి శేఖర్ వి జోసెఫ్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి., భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటోంది. ఈ మూవీని అన్ని కార్యకమ్రాలు ముగించి ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నారు.














