తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ అధికారిణి నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నళిని తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవలే జరిగిన పోలీసు శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే నళిని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)