జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం లింగరాజుపాలెం హైస్కూల్ ఉపాధ్యాయుడు భూషణ్ శ్రీధర్, చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాయిపల్లి హైస్కూల్ టీచర్ మునిరెడ్డిని ఎంపీక చేశారు. తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ జిల్లా సావర్ ఖేడ్ స్కూల్ ఉపాధ్యాయుడు రంగయ్య, సిద్దిపేట జిల్లా ఇందిరానగర్ హైస్కూల్ హెడ్ మాస్టర్ రామస్వామి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది కేంద్రం ప్రభుత్వం.