Namaste NRI

ప్రధాని నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భేటీ

భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ముంబయిలోని లోక్ భవన్లలో సమావేశమయ్యారు. మాక్రాన్ ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు తాజ్ హోటల్ దగ్గర 26/11 ముంబయి పేలుళ్ల మృతులకు మెక్రాన్ ఆయన సతీమణి బ్రిగిట్టి నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చారు. రఫేల్ ఫైటర్ జెట్ ఒప్పందం, కృత్రిమ మేధాలో సహకారం ప్రధాన అంశాలుగా అధ్యక్షుడి పర్యటన సాగనుంది. ఢిల్లీలో జరుగుతున్న’ ఏఐ ఇంపాక్ట సమ్మిట్ ‘ లో మెక్రాన్ పాల్గొంటారు. భారత్ కు 114 రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకు మెక్రాన్ పర్యటన సమయంలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్ట్ విలువ 3.25 లక్షల కోట్లు. ఇది ఖరారు అయితే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందం అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events