Namaste NRI

గెటప్ శ్రీను రాజు యాదవ్ నుంచి లేదే..లేదే.. లోకంలోనే ప్రేమే లేదసలే

గెటప్‌శ్రీను హీరోగా నటిస్తున్న చిత్రం రాజు యాదవ్‌. కృష్ణమాచారి కె. దర్శకుడు. సాయి వరుణవి క్రియేషన్స్‌, ఖరిష్మ డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతున్నది.  ప్రమోషన్‌ విషయంలో ఈ సినిమా టీం వేగం పెంచింది. ఇందులో భాగంగా ఈ సినిమాకు చెందిన ఓ విషాద గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. లేదే లేదే ప్రేమసలే అంటూ సాగే ఈ గీతాన్ని చంద్రబోస్‌ రాసి, ఆయనే స్వయంగా ఆలపించడం విశేషం.

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం సమకూర్చిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. గుండెలు బరువెక్కేంత విషాదాన్ని చంద్రబోస్‌ తన గొంతులో పలికించారని, అత్యంత సహజంగా, వాడుక భాషతో మనసుల్ని కరిగించేలా ఈ పాటను చంద్రబోస్‌ రాశారని వారు తెలిపారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగాయని, ఆ అంచనాలను మించి సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నామని, త్వరలోనే భారీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 17న ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events