హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన్‌తో విజన్ డాక్యుమెంట్-2050ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లోపల ఉన్న ప్రాంతాన్ని ఓ యూనిట్‌గా, ఓఆర్‌ఆర్-రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌ఆర్) మధ్య ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్‌గా తీసుకొని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఓఆర్‌ఆర్-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రాం తాన్ని హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేవాలని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన సిటీతోపాటు ఆ చుట్టుపక్కల కొత్తగా విస్తరిస్తున్న మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతమివ్వాలని సూచించారు. సచివాలయంలో ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హెచ్‌ఎండీఏలో కీలక విభాగాలైన పట్టణ ప్రణాళిక (ప్లానింగ్), ఇంజినీరింగ్, ఓఆర్‌ఆర్, ఉమ్టా, లేక్ ప్రొటెక్షన్, ల్యాండ్ పూలింగ్ స్కీం, ఎస్టేట్ విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించా రు. ఓఆర్‌ఆర్ నుంచి ట్రిపుల్‌ఆర్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
అలాగే ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ కొన్ని పట్టణాలు, కీలక ప్రాంతాలు ఉన్నాయి. వీటినే అర్భన్ నోడ్‌లుగా వ్యవహారిస్తున్నారు. వీటిని కలుపుతూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు వరకు కూడా రహదారులను కొనసాగించను న్నారు. ఇలా మొత్తం 25 రహదారులను కొత్తగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఔటర్, రీజనల్ రింగ్‌రోడ్డుకు మధ్య కొన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంతోపాటు కొత్తవి కూడా నిర్మించనున్నారు. 450 కిలోమీటర్ల విస్తీర్ణంలో వీటిని నిర్మించటానికి ప్రాథమికంగా కసరత్తు జరుగుతోంది. వీటిని కనీసం 4 లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. కొత్త రహదారులు కలిపే కీలక ప్రాంతాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్, దౌడుగూడ, గుండేలగూడ, రాచలూరు, ఇబ్రహీంపట్నం, బీబీనగర్, బొమ్మలరామారం, ములుగు, వర్గల్, తూప్రాన్, దొంతి, శివ్వంపేట, నర్సాపూర్, దౌల్తాబాద్, ఇస్మాయిఖాన్‌పేట, ఎదుమైలారం, శంకర్‌పల్లి, చేవేళ్ల, తడ్లపల్లె, ఫరూఖ్‌నగర్, షాబాద్, చేవేళ్ల, సంగారెడ్డి, జీడిపల్లె, తూప్రాన్, బీబీనగర్, భువనగిరి, మల్కాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, గుండేలగూడ తదితర ప్రాంతాలు ఉన్నాయి.