పౌరాణిక ప్రేమ కథా చిత్రం శాకుంతలం. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించగా, శకుంతల పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత ఒదిగిపోయింది. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని నాల్గోవ పాటను రిలీజ్ చేశారు. మధుర గతమా అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను అర్మాన్ మాలీక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. శ్రీమణీ సాహిత్యం అందించాడు. లేటెస్ట్‌గా రిలీజైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్‌లోని విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. మణిశర్మ చాలా రోజుల తర్వాత తన స్థాయి ఆల్భమ్ ఈ సినిమాకు అందించాడు. మోహన్ బాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ గెస్ట్ రోల్ పోషించింది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.














