Skip to main content

Namaste NRI

శాకుంతలం నుంచి మధుర గతమా.. లిరికల్ సాంగ్

పౌరాణిక ప్రేమ కథా చిత్రం శాకుంతలం. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించగా, శకుంతల పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత ఒదిగిపోయింది. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై  నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని నాల్గోవ పాటను రిలీజ్ చేశారు. మధుర గతమా అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను అర్మాన్ మాలీక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. శ్రీమణీ సాహిత్యం అందించాడు. లేటెస్ట్‌గా రిలీజైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్‌లోని  విజువల్స్ గ్రాండియర్‌గా  ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్‌లుగా  నిలిచాయి. మణిశర్మ చాలా రోజుల తర్వాత తన స్థాయి ఆల్భమ్ ఈ సినిమాకు అందించాడు. మోహన్ బాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ గెస్ట్ రోల్ పోషించింది.  గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై  నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియా చిత్రాన్ని  వ‌ర‌ల్డ్ వైడ్‌గా  తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Social Share Spread Message

Latest News