
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ మీడియా సమావేశంలో 2024కు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. మొత్తం 1248 నామినేషన్లను పరిశీలించిన కమిటీ, విజేతలను ఎంపిక చేసింది. తెలంగాణ యుద్ధ నౌక, దివంగత ఉద్యమ నేత గద్దర్ పేరు మీద.. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్దులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలిసారి గద్దర్ అవార్డులు అందజేయనున్నారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ప్రకటించారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి- చక్రపాణి, కాంతారావు , రఘుపతి వెంకయ్య పేర్లతో కూడా అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం జూన్ 14న హైటెక్స్‌లో జరగనుంది.


గద్దర్ అవార్డు విజేతల జాబితా :
బెస్ట్ మూవీ- కల్కి
బెస్ట్ సెకండ్ ఫిల్మ్ – పొట్టేలు
బెస్ట్ థర్డ్ ఫిల్మ్ – లక్కీ భాస్కర్
బెస్ట్ హీరో- అల్లు అర్జున్ (పుష్ప-2)
బెస్ట్ డైరెక్టర్- నాగ్ అశ్విన్ (కల్కి)
బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లురీ ( లక్కీ భాస్కర్)
బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్. జె సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్
స్పెషల్ జ్యురీ అవార్డు_ దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )
బెస్ట్ స్టోరీ రైటర్ _ శివ పాలడుగు
స్పెషల్ జ్యురీ అవార్డు ఫీమేల్ – అనన్య (పొట్టేలు)
ఉత్తమ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్ఉ
త్తమ నూతన దర్శకుడు : ఎదు వంశీ
హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్
-బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
-మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
-బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
-బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
-బెస్ట్ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
-ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
-ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
-బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
-ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
-బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
-బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
-బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
-బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
-బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
– బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
